Take a fresh look at your lifestyle.

డా. బి. ఆర్. అంబేద్కర్ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేశారు : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

డా. బి. ఆర్. అంబేద్కర్ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేశారని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తెలిపారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా, అంబేద్కర్ విగ్రహం వద్ద, భువనగిరి పట్టణములో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, భువనగిరి ఆర్ డి ఓ కృష్ణా రెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ వాణి,వైస్ చైర్మన్ మంజుల, గ్రంధాలయ చైర్మన్ అవేజ్ చిస్తీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేణుక బాబురావు , ప్రజా ప్రతినిధులు, యస్ .సి సంఘం సభ్యులు విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానుభావుడు అని కొనియాడారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు మాట్లాడుతూ బడుగు, బలహీన, అణగారిన వర్గాల వారి కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని అన్నారు. ప్రతి ఒక్కరు ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి అంబేద్కర్ బాటలో మనమందరం ముందుకు వెళ్లాలన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో శోభారాణి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సాహితి , ప్రజా ప్రతినిధులు, ఎస్సీ సంఘ నాయకులు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.