జర్నలిస్టు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: టియూడబ్ల్యూజే సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కోల నాగేశ్వరరావు
హుజూర్ నగర్ : జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు కోరారు. సోమవారం పట్టణంలో యూనియన్ కార్యాలయంలో టి యు డబ్ల్యుజె, ఐజేయు యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోలా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అక్కడేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని ఆ హామీని అమలు చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల కీలక పాత్ర పోషించారని వారిని విస్మరించడం సరైన విధానం కాదన్నారు.
గత టిఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్ కార్డులు సక్రమంగా పనిచేయడం లేదని అన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా స్పందించి హెల్త్ కార్డులు సక్రమంగా అమలు చేయాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలను జర్నలిస్టులకు వర్తింపచేసి వారిని అర్హులుగా ప్రకటించాలని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరైన విధానం కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పాత్రికేయులు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో పిల్లల శ్రీనివాసరావు, షేక్ జాను భాష, బసవోదు శ్రీనివాస చారి, కీతారామనాదం, నరేందర్ , దేవరం రామ్ రెడ్డి, ఆర్ పి గౌడ్, దేవర రామ్ రెడ్డి, వెంకటరెడ్డి, ఇట్టి మల్ల రామకృష్ణ, ఇందిరాల రామకృష్ణ కోమరాజు అంజయ్య, పాల్గొన్నారు..
ప్రెస్ క్లబ్ నూతన మీటింగ్ కమిటీ ఎన్నిక.
హుజూర్నగర్ పట్టణంలో సోమవారం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యాలయంలో హుజూర్నగర్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షులుగా కోలా నాగేశ్వరరావు…
అధ్యక్షులుగా పిల్లలందరి శ్రీనివాస్…
ప్రధాన కార్యదర్శిగా షేక్ జాన్ పాషా…
వర్కింగ్ ప్రెసిడెంట్గా బసవోజు శ్రీనివాస చారి….
వైస్ ప్రెసిడెంట్గా కితా రామనాథం …
కోశాధికారిగా దేవరం రామ్ రెడ్డి…
ఉపాధ్యక్షులుగా ఇట్టి మల్ల రామకృష్ణ…
సహాయ కార్యదర్శిలుగా దేవరం వెంకటరెడ్డి…
షేక్ నాగు మేరా…
కోమరాజు అంజయ్య…
గౌరవ సహోదారులుగా దినముకొండ శేషం రాజు…
సలహాదారులుగా నరేందర్, ఆర్ పి గౌడ్ ఎన్నికయ్యారు.