Take a fresh look at your lifestyle.

బాసర అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు వేద మంత్రోచ్చారణల నడుమ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం అర్చకులు మంత్రికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే మహంకాళి, దత్తాత్రేయ స్వామిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం వసతి గృహంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంత్రికి నిర్మల్ పెయింటింగ్స్ బహుకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని ఆలయాలను దశలవారీగా అభివృద్ధి చేస్తోందని, బాసర నూతన ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మాస్టర్ ప్లాన్ అమలుపై ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రితో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంతకుముందు ఐఐఐటి వసతి గృహంలో మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో కోమల్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ పాఠక్, ఈవో సుదర్శన్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.