ముద్ర విలేఖరి, నడిగూడెం: షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు బాబావారికి పంచామృతాలతో అభిషేకం ప్రత్యేక పూజలు అలంకరణ సాయి సత్సంగం గురువులకు సన్మానం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కేఆర్ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రధాన ఆచార్యులు అరవపల్లి శంకర్ పందిరి వెంకటరెడ్డి రానబోతు రాపిరెడ్డి, సునీత, పసుపులేటి బిక్షమయ్యలను ఈ సందర్భంగా సత్కరించారు. సాయి సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు రేపాల పురుషోత్తం ఎం వి రామారావు మహేష్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.మందిర పూజారి రాజశేఖర్ శర్మ భక్తులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ పురవీధుల గుండా సాయిబాబా పల్లకి సేవ నిర్వహించారు.