Take a fresh look at your lifestyle.

అంగరంగ వైభవంగా వాసవి అమ్మవారి జయంతి

కోరుట్ల, ముద్ర విలేకరి:  కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా కోరుట్ల వాసవి ఆలయంలో వైశ్య సంఘ అధ్యక్షులు మోటూరి రాజు ఆధ్వర్యంలో మొదట వాసవి అమ్మ వారి ఉత్సవమూర్తికి ఫల పంచామృతాభిషేకాలను అర్చకులు పాలెపు రాముశర్మ వైదిక నిర్వహణలో ఘనంగా నిర్వహించారు.అనంతరం హవన కార్యక్రమం, వాసవి అమ్మవారి పారాయణం, కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా వనిత క్లబ్ ఆధ్వర్యంలో వాసవి అమ్మవారికి పూలు, పండ్లు, వస్త్రాలను సమర్పించడం జరిగింది.ఈ ఉత్సవంలో పెద్ద ఎత్తున వైశ్యులు కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించుకున్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బుడికే శ్రీకాంత్, కోశాధికారి నీలి సంతోష్, వెంకటేశ్వర దేవాలయ డైరెక్టర్ నేతి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు నీలి కాశీనాథ్, నీలి మధు, వనిత క్లబ్ కార్యదర్శి ముత్యపు మంజుల, కోశాధికారి గుడిసె శివజ్యోతి, ఆవోపా అధ్యక్షులు కోటగిరి మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.