Take a fresh look at your lifestyle.

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను ఆర్కేపీ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సూపర్ బజార్ సాయిబాబా ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద అమ్మవారి చిత్రపటానికి పూల మాలలు వేసారు.అర్చకుడు రామకృష్ణమూర్తి నేతృత్వంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను జరిపారు.అనంతరం 21 తీర్ల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించారు. ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్,మండల అధ్యక్షుడు కటుకం నాగరాజు,గౌరవ అధ్యక్షుడు ఎల్లెంకి సత్తయ్య,భీమయ్య,రామకృష్ణ,మధుసూదన్,గోపాల్,సురేష్,రమేష్,వెంకట్ రాజాం,మాతలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.