Take a fresh look at your lifestyle.

ఫిర్యాదులు వస్తే సత్వరమే స్పందించాలి

  • ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి.

ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : ప్రజల నుండి ఫిర్యాదులు వస్తే సత్వరమే స్పందించి పరిష్కరించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధికారులు ఆదేశించారు. గురువారం కల్వకుర్తి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్ధాయి విద్యుత్, రెవిన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు.వివిధ గ్రామాల ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభమైనందున విద్యుత్ కోతలు లేకుండా చూడాలని ఎక్కడైనా శిథిలావస్థలో స్తంభాలు ఉంటే వాటిని గుర్తించి తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాలని సూచించారు.తదుపరి కల్వకుర్తి నుండి తలకొండపల్లి వరకూ నడిచే నూతన బస్సును ప్రారంభించి బస్సును బస్టాండ్ నుండి క్యాంపు ఆఫిస్ వరకూ స్వయంగా నడిపారు. కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డ్ సభ్యుడు బాలాజీ సింగ్, ఎమ్మార్వోలు శ్రీలత, నాగార్జున, వినయ్ సాగర్, ముంతాజ్, కార్తిక్, ఇబ్రహిం, సునీత, DE లు గోపాల్, శ్రీదర్ శెట్టి, ఏడీఈ లు బాలకృష్ణ, శంకరయ్య , ఏఈలు వివిధ మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.