ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : పట్టణంలో ప్రసిద్ధి గాంచిన హనుమాన్ దేవాలయం లో హనుమాన్ జయంతి వేడుకలకు శనివారం రోజు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా ప్రత్యేక హోమాలు నిర్వహించారు.భక్తులు ఉదయం స్వామి వారికి అభిషేకం నిర్వహించి,అష్టోత్తర పూజలు చేశారు.ఆంజనేయ స్వామి వారికి లక్ష తమలపత్ర అర్చన నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.పట్టణ ప్రజలతో పాటు సమీప గ్రామాల ప్రజలు అధిక మంది పాల్గొనడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది.