మండల కేంద్రంలో పాటు వివిధ గ్రామాల్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు స్వచ్ఛంద సంస్థలు సర్పంచులు
ముద్ర, తుంగతుర్తి….
భారత రాజ్యాంగ నిర్మాత భారత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు తుంగతుర్తి మండల కేంద్రంలో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు, ఈ మేరకు వివిధ రాజకీయ పార్టీలు ,ప్రజా సంఘాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు, ఆయన సేవలను పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహాలకు, చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన అతి కొద్ది మందిలో అంబేద్కర్ ఒకరిని అన్నారు, అంతేకాక భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టిన గొప్ప దార్శనిక నాయకుడు అంబేద్కర్ అని అన్నారు, దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించడంతోపాటు మహిళా సాధికారతకు, కార్మికుల హక్కుల పరిరక్షణకు ఆయన చేసిన సేవ మరువలేమని అన్నారు, ఆయన రచించిన రాజ్యాగం లోని ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు, అంబేద్కర్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని సమానత్వం న్యాయం కోసం ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని అన్నారు, సమాజంలో ప్రతి ఒక్కరు ఐక్యత, సౌబ్రాతృత్వం, పెంపొందించేందుకు అంబేద్కర్ చూపిన దారిలో నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా డిసిసి అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య జిల్లా నాయకులు గుండ గాని రాములు గౌడ్, తడకమళ్ళ రవికుమార్, గోపగాని రమేష్ గౌడ్ గోపగానీ శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాయ సంఘం నాయకులు మల్లెపాక రవీందర్, తుంగతుర్తి గ్రామ సర్పంచ్ మల్లెపాక సాయిబాబా, తుంగతుర్తి సీఐ నరసింహారావు, ఎస్సై క్రాంతి కుమార్, వెటర్నరీ హాస్పిటల్లో పశువైద్య సహాయ సంచాలకులు డాక్టర్ రవి ప్రసాద్ అన్నారం గ్రామంలో సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తో పాటు వివిధ గ్రామాల్లో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శుల తో పాటు ఆయా గ్రామాల సర్పంచులు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసే కార్యక్రమాల్లో పాల్గొన్నారు.