Take a fresh look at your lifestyle.

బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం- వనపర్తి కార్నర్ మీటింగ్ లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

ముద్ర, వనపర్తి :

వనపర్తి మున్సిపాలిటీ లో బీ ఆర్ ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తే అభివృద్ధి జోరుగా సాగుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు సోమవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడం తో వనపర్తి పట్టణం లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆ పార్టీ నేత స్వామి గౌడ్ తో కలిసి మాజీ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిరంజన్ రెడ్డి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసిఆర్ అధికారం లోకి వచ్చాకా రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు.తెలంగాణ రాకముందు 14లక్షల ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందిందని,తెలంగాణ
వచ్చిన తర్వాత కోటి ఇరువై లక్షల ఎకరాలకు సాగు నీరు అందించిన ఘనత కెసిఆర్ కే దక్కిందన్నారు.కరెంట్,మంచినీళ్ళు సరఫరా చేయడానికి కాంగ్రెస్ పార్టీకి చేతనైతలేదన్నారు. పరిశ్రమలు నెలకొల్పి 16లక్షల ఉద్యోగాలు వచ్చాయని, ఐ.టి అభివృద్ధితో 19లక్షల ఉద్యో గాలు వచ్చాయన్నారు.
వలసలు నివారించి ఇతర ప్రాంతాల ప్రజలు తెలంగాణ వైపు వచ్చారని నిరంజన్ రెడ్డి అన్నారు.వనపర్తిలో 3420 డబల్ బెడ్ గదులు నిర్మించామన్నారు.రేవంత్ రెడ్డి సీఎం అయ్యాకా కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ ప్రజలను నట్టేట ముంచారన్నారు.యూరియా బస్తా కోసం క్యూ కట్టాల్సిన దుస్థితి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు.విద్యార్థినులకు స్కూటీలు రాలేదు, ఉద్యోగాలు రాలేదన్నారు.కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే మరోసారి మోసం జరుగుతుందని, ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను ఓడించి గట్టి బుద్ధి చెప్పాలని నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశం లో 31మంది బి.ఆర్.ఎస్ అభ్యర్థులు,ఇద్దరు సి.పి.ఏం అభ్యర్థులు, నాయకులు యాదవ్,లక్ష్మయ్య, శ్రీధర్, రమేష్ గౌడ్, అశోక్,గంధం. బాలపీరు, వేణుగోపాల్, గులాం ఖాదర్ ఖాన్, బొబ్బిలి ప్రేమ్ కుమార్ సయ్యద్.జమీల్, సూర్యవంశం.గిరి, జోహెబ్ హుస్సేన్, చిట్యాల.రాము,మాజీ ప్రజాప్రతి నిధులు కృష్ణా నాయక్ ,జగదీశ్వర్ రెడ్డి,రఘుపతి రెడ్డి, అమ్మపల్లి శ్రీనివాస్ రెడ్డి,భీమన్న, మధుసూదన్ రెడ్డి,దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.