Take a fresh look at your lifestyle.

ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి-పాపన్నపేటలో కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్:
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సూచించారు. ఆదివారం సాయంత్రం పాపన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియలో రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని స్థానిక నాయకులు, రైతులు ఆయన దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి పలువురు రైస్ మిల్లర్లతో ఫోన్లో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు లేకుండా మిల్లుకు వచ్చిన వెంటనే ధాన్యాన్ని ఖాళీ చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని రైస్ మిల్లర్లకు సూచించారు. రైతులు అధైర్య పడవద్దని పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. అధికారులు ఎప్పటికపుడు కొనుగోలు ప్రక్రియను పరిశీలించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, మండల నాయకులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీకాంతప్ప, శ్రీనివాస్, హీరాలాల్, గౌస్ తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.