Take a fresh look at your lifestyle.

గాంధారి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎనిమిదో వార్డు మాజీ కౌన్సిలర్ అలుగుల శ్రీలత – సత్తయ్య,తొమ్మిదో వార్డు మాజీ కౌన్సిలర్ పారిపెల్లి తిరుపతి ఆధ్వర్యంలో బొక్కల గుట్ట గాంధారి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు,అర్చన చేశారు. అనంతరం చెన్నూరు నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్ సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.గురవయ్య, శివ, సాయి కృష్ణ, దినేష్, మణి, సందీప్, రవి, పవన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.