Take a fresh look at your lifestyle.

మంబోజిపల్లిలో ఆదిమానవుల రాతి చిత్రాలు

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా మెదక్ మండలం మంబోజిపల్లి నిజాం డక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పక్కనే ఉన్న రాళ్ల గుట్టపై 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పైన రాతిచిత్రాల కాన్వాస్ ను కొత్త తెలంగాణ చరిత్రబృందం పరిశోధక సభ్యుడు బుర్ర సంతోష్ గుర్తించాడు.
రెండు తాబేళ్ళు, జిగ్ జాగ్ రేఖలు, పాత్రలు 6, గొలుసుకన్నెలు ఒక వరుసలో, వెనక వేలాడే బుట్ట, చెట్లవలె కనిపిస్తున్న పొడవైన నిలువుగీతలు, నిలువుగా, అడ్డంగా రెండ్రెండు గీతలు, 4 బాణాలతీరు బొమ్మలు ఒక దిశలో, ఒక ద్వంద్వ వృత్తానికి నలువైపుల గురిచేసినవి, 5 బాణాలు ఒక వృత్తంలో ఇవన్నీ అరుదైన రాతిచిత్రాల డిజైన్లు, దీర్ఘవృత్తాలు, వృత్తాలు, త్రిశూలంవలె, తేనెపట్టువలె, సన్నని 8,9గీతలతో కంఠహారంవలె కనిపించే అర్థవృత్తం, ఇంకా అధ్యారోపణం చేయబడినవెన్నో రాతిచిత్రాలు, కొన్ని గుర్తించడానికి వీలుకాని డిజైన్లు ఈ రాతిచిత్రాలతావులో కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రాతిచిత్రాలన్నీ ఎరుపురంగులో గీసినవే. రంగుగాఢతను, గీతలనుబట్టి ఈ చిత్రాలలో కొన్ని పెదరాతియుగానికి, ఎక్కువమట్టుకు చారిత్రకయుగానికి చెందినవని చెప్పవచ్చని రాతిచిత్రాల నిపుణులు డా. బండి మురళీధర్ రెడ్డి, శ్రీరామోజు హరగోపాల్ అన్నారు. క్షేత్రపరిశోధన కొత్త తెలంగాణచరిత్రబృందం సభ్యుడు బుర్రా సంతోష్ చేయగా
విషయ వివరణ కొత్త తెలంగాణచరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.