Take a fresh look at your lifestyle.

స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి ఎంపికలు

ముద్ర ప్రతినిధి,, మెదక్:
తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి ఎంపికలు మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించారు.


జిల్లాలోని వివిధ మండలాల నుండి 31 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రమేష్ గంగాల ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ లో చేరుటగాను జిల్లాలోని మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలను నిర్వహించారు. అర్హత సాధించిన వారికి ఏప్రిల్ 27 నుండి జరిగే రాష్ట్ర స్థాయి ఎంపికల్లో పాల్గొనవలసి ఉంటుందని తెలిపారు. విద్యార్థుల ఎంపిక నిర్వహణలో వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్ రావు, మాధవ రెడ్డి, మధుసూదన్, శ్యాం, దేవేందర్ రెడ్డి, రవి, ప్రదీప్ రెడ్డి, సత్యం, దాసరి మధు, శంకర్, శిల్ప తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.