Take a fresh look at your lifestyle.

వెంకటాపూర్ లో రహదారి పై “వరి”నాట్లతో గ్రామస్తుల నిరసన

వెల్గటూర్, ముద్ర : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో అక్కడి గ్రామస్థులు రహదారి పై” వరి” నాట్లు వేస్తూ శుక్రవారం నిరసనను తెలియజేశారు. కాగా ఈ మధ్యకాలంలో తరచుగా కురుస్తున్న వర్షాలతో బస్టాండ్ నుంచి గ్రామంలోకి వెళ్లే రహదారి పూర్తిగా బురదమయంగా మారింది. దీనితో బాటసారులు గ్రామంలోకి వెళ్లడానికి తీవ్రంగా శ్రమించవలసి వస్తుంది. ఈ సందర్భంగా అక్కడ నిరసన తెలిపిన గ్రామస్తులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఇక్కడ గల రహదారితో చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వర్షాకాలంలో ఈ రహదారిగుండ అసలే ప్రయాణం చేయలేక పోతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి రహదారి నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.