- ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రతి ఆడబిడ్డ తల్లి కావాలని ప్రధానంగా కోరుకుంటుందని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల పట్టణంలో ఓల్డ్ హైస్కూల్లో భారతదేశం లోనే మెగా మొబైల్ ఫెర్టిలిటీ క్యాంపు, ఒయాసిస్ ఫెర్టిలిటీ జననీ యాత్రను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లలు కానీ వారికి ఇదొక చక్కని అవకాశమని,వ్యాపార ప్రకటనలు నమ్మి చాలా మంది మోసపోతారని, ఒయాసిస్ జననీ యాత్ర అనేది ఒక మంచి ప్రయత్నం అని అన్నారు.అవగాహన లోపం కూడా పిల్లలు కాకపోవడం ప్రధాన కారణం అని అలాంటప్పుడు వైద్యులను సంప్రదించాలని,మూఢ నమ్మకాలను నమ్మవద్దన్నారు.ఉచితంగా ఒయాసిస్ టీమ్ పరీక్షలు నిర్వహించడం అభినందనీయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు అడువాల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం, డా.పద్మిని, డా.శ్రీలత, డా. జిజ్ఞా, డా. సంయుక్త, మాజీ కౌన్సిలర్ లు చుక్క నవీన్, తోట మల్లికార్జున్, కూతురు రాజేష్, డిష్ జగన్, సుధాకర్,ఆనంద్ రావు, దుమాల రాజ్ కుమార్, శ్రీనివాస్, కోటేశ్వర రావు, తొలిప్రేమశ్రీనివాస్, ములసపు మహేష్, ఒయాసిస్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
