ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
వరిధాన్య కొనుగోళ్లు ముమ్మరం అవుతున్న సందర్బంగా, మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతులు చేసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు భాస్కర్ రావు , రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డిలు అన్నారు.
రబీ 2025-26 వరిధాన్య కొనుగోళ్ల విషయమై వారు శనివారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భాస్కరరావు మాట్లాడుతూ వరిధాన్య కొనుగోళ్లు ముమ్మరం అవుతున్న సందర్బంగా, మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతులు చేసుకోవాలని, సరిపడా హమాలీలను నియమించి, దిగుమతులు వెంటనే జరిగేలా చూడాలని అన్నారు. ప్రభుత్వం రబీ 2024-25 సిఎంఆర్ గడువు పొడిగిస్తూ, డెలివరీకి అనుమతించినందున, వెంటనే రబీ సిఎంఆర్ డెలివరీ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రోజా రాణి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు హరికృష్ణ, మిల్లర్లు పాల్గొన్నారు.