ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ నియోజకవర్గంలోని అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లను ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్ల ద్వారా పోషణ, ఆరోగ్యపరమైన వివరాలను నమోదు చేయడం సులభతరం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, మేడిసెమ్మ రాజు, పట్టణ కౌన్సిలర్ గంజి విజయ్ కుమార్ (రాజు), బీజేపీ నాయకులు రాచకొండ సాగర్, అంగన్వాడీ టీచర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా బసవేశ్వర జయంతి వేడుకలు

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుల, లింగ వివక్షతను, మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తూ, సమసమాజ స్థాపన కోసం వారు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు రితేష్ రాథోడ్, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, మేడిసెమ్మ రాజు, బీజేపీ నాయకులు వీరేష్, సాగర్, ఆనంద్ తో పాటు గ్రామాల సర్పంచ్ లు, బీజేపీ పట్టణ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.