Take a fresh look at your lifestyle.

ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు చేర్చాలి -కలెక్టర్ భవేశ్ మిశ్రా

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సారంగాపూర్ మండలం చించోలి (బి) గోదామును ఆయన పరిశీలించారు. ధాన్యం అన్లోడ్ అవుతున్న తీరును చూశారు. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. తగినంత మంది హమాలీలతో అన్లోడింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసి, లారీలను వేగవంతంగా ఖాళీ చేయాలన్నారు. అన్లోడింగ్ పూర్తయిన వెంటనే లారీలు తిరిగి కొనుగోలు కేంద్రాలకు పంపాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన ధాన్యం నిల్వ ఉండరాదన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, పౌరసరఫరాల అధికారులు రాజేందర్, సుధాకర్ తహసిల్దార్ విజయ కాంతారావు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.