Take a fresh look at your lifestyle.

ఉమెన్ పోలీస్ స్టేషన్, ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ

ముద్ర ప్రతినిధి, ఆదిలాబాద్: పట్టణంలో నేరాల అదుపులకు పటిష్టమైన చర్యలు చేపడుతూ గస్తీ పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఉమెన్ పోలీస్ స్టేషన్ మరియు ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ సిబ్బందిని ఉద్దేశించి పలు సూచనలు చేశారు.పోలీస్ స్టేషన్కు వచ్చి బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించే దిశగా త్వరితగతిన సిబ్బందిని కేటాయించి బాధితులకు తగ న్యాయం చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రతతో ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ రికార్డుల నిర్వహణ ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సీ లేకుండా చూడాలన్నారు. ముఖ్యంగా మహిళల పట్ల వారి ఫిర్యాదుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మహిళా ఫిర్యాదుదారులకు న్యాయం జరిగే విధంగా సున్నితమైన అంశాలను జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలని సూచించారు. మహిళల పట్ల ప్రత్యేకంగా మహిళా పోలీస్ స్టేషన్ ఉన్నందున ఎలాంటి భార్యాభర్తల సమస్యలు ఉన్న వారిని పరిష్కరించే దిశగా బాధితులకు న్యాయం చేసే దిశగా తగు చర్యలను చేపట్టాలన్నారు. త్వరలో రానున్న ఎన్నికలకు ప్రతి ఒక్కరు పూర్తి సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రతి వార్డుకు పోలీసు అధికారిని కేటాయించి విపియో విధానాన్ని అమలు చేయాలన్నారు. ముఖ్యంగా పట్టణంలో ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా గస్తీ నిర్వహించాలన్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్న బ్లూ కోర్ట్, డయల్ హండ్రెడ్, స్టేషన్ రైటర్స్, సెక్షన్ ఇంచార్జ్, ఫైవ్ ఎస్, పెట్రో కార్, రిసెప్షన్ లాంటి వర్టికల్స్ను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. రాత్రి సమయాలలో గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఆదిలాబాద్ పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో గంజాయి, మట్కా, పేకాట లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలి అన్నారు. రాత్రి సమయాలలో మరింత పటిష్టంగా గస్తీ పెట్రోలింగ్ నిర్వహిస్తూ నేరాల అదుపునకు కృషి చేయాలన్నారు. సాయంత్రం సమయాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలన్నారు. ముఖ్యంగా కేసుల దర్యాప్తునందు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సరైన సమయంలో దర్యాప్తు చేసి కోర్టుల నందు చార్జిషీటు దాఖలు చేసినప్పుడు బాధితులకు సరైన న్యాయం జరుగుతుందని తెలిపారు. దీర్ఘ కాలికంగా పెండింగ్లో ఉన్న కేసుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ సిహెచ్ కరుణాకర్ రావు, ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.