Take a fresh look at your lifestyle.

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ జిల్లా కో ఆర్డినేటర్ గా రజనీ

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ జగిత్యాల జిల్లా చీఫ్ కో ఆర్డినేటర్ గా జగిత్యాలకు చెందిన దాసరి రజనీ నియామకమయ్యారు.ఈ మేరకు సంస్థ ఫౌండర్ అధ్యక్షులు, చైర్మన్ చింతపట్ల వెంకటాచారి రజనీ నీ నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్బంగా జిల్లా కో ఆర్డినేటర్ రజనీ మాట్లాడుతూ తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ అయినటువంటి ఫౌండర్ చైర్మన్ చింతపట్ల వెంకటాచారి స్థాపించడం జరిగిందని, మారిషస్ ప్రధానమంత్రి చేతుల మీదుగా 2012లో రికార్డ్స్ ఆవిష్కరణ జరిగిందని అన్నారు.ప్రపంచంలోని తెలుగు వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడానికే దీన్ని స్థాపించారని తెలిపారు.ప్రస్తుతం సింగాపూర్, మలేషియా, యకే, ఆఫ్రిక, అబుదాబీ, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, సౌదీ అరేబియా, మారిషస్,మొదలగు దేశాల్లో కో ఆర్డినేటర్స్ పనిచేస్తున్నారని వివరించారు. ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా రికార్డ్ హోల్డర్స్ తో సంస్థ ముందుకు సాగుతుందని, సలహాదారులుగా రమణచారి, మండలి బుద్ధ ప్రసాద్ లున్నారని వెంకటాచారి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.