ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ఈనెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఎం.విష్ణుమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి హనుమంతరావు ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో శాంతి భద్రతలను పరిరక్షించుటకు, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించుటకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో మద్యం దుకాణాల మూసివేతకు (డ్రై డేస్) సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసినట్లు చెప్పారు.
09.02.2026 సాయంత్రం 05:00 గంటల నుండి 11.02.2026 నాడు పోలింగ్ పూర్తి అయ్యే వరకు భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు మూసివేయబడునని చెప్పారు.
13న ఎన్నికల ఫలితాల నాడు ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని మద్యం షాపులు, బార్‌లు, రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపో పూర్తిగా మూసివేయబడునన్నారు. అతిక్రమించిన వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.