ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
వికారాబాద్ జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామాన్నారు. పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియలు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించబడతాయి.
కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే కౌంటింగ్ సూపర్వైజర్లు మరియు అసిస్టెంట్లకు సంబంధించిన ఆదేశాలు ఇప్పటికే సంబంధిత మున్సిపాలిటీలకు పంపించబడినవి. వారందరికీ శిక్షణ కార్యక్రమం 9వ మధ్యాహ్నం 2:30 గంటలకు, వికారాబాద్ వద్ద నిర్వహించబడుతుందన్నారు. సంబంధిత సిబ్బంది సమయానికి హాజరు కావాలి.
ఎన్నికల నిర్వహణలో శాంతి, భద్రత, పారదర్శకత కోసం అన్ని శాఖలతో సమన్వయం చేసి తగిన చర్యలు తీసుకోబడినవి. ప్రజలు ఎన్నికల ప్రక్రియలో సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు