28వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సూదగాని సరిత రాజు గౌడ్ ను గెలిపించాలి:భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, భువనగిరి:
భువనగిరి పట్టణం 28వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సూదగానిగ సరిత రాజు గౌడ్ ను గెలిపించాలని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కోరారు. భువనగిరి పట్టణం మీనానగర్ కాలనీలోని కాంగ్రెస్ అభ్యర్థి ఇంటింటికి ప్రచారం నిర్వహించగా ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కుంభం హాజరై మాట్లాడారు. మీనానగర్ కాలనీ అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సూదగాని సరిత రాజు గౌడ్ హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.