Take a fresh look at your lifestyle.

24న కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు యాదగిరి, ప్రధాన కార్యదర్శి వెంకట్ రామ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా కలెక్టరేట్ ముందు ఈనెల 24న నిరసన ప్రదర్శన విజయవంతం చేయాలని టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు
కె. యాదగిరి, ప్రధాన కార్యదర్శి  పి. వెంకట్ రామ్ రెడ్డి పిలుపునిచ్చారు.
అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ బడ్జెట్ కేటాయించి ప్రకటిత విద్యా లక్ష్యాలను వమ్ము చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత బడ్జెట్ లో గతం కంటే 0.63 శాతం మాత్రమే నిధులు పెంచారన్నారు.
తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్ట్ ప్రకారం అత్యంత నిర్లక్ష్యానికి గురికాబడ్డ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో కింది డిమాండ్లను పరిష్కరించాలని ఈ నెల 24 మంగళ వారం నాడు మధ్యాహ్నం 1.00 లకు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయులు, విద్యాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
విద్యారంగానికి నిధులను20 శాతానికి పెంచాలని, రిటైర్డ్ టీచర్ల పెన్షనరీ ప్రయోజనాల పెండింగ్ బిల్లులను ఏక మొత్తంలో విడుదల చేయాలని, టీచర్ల పెండింగు బిల్లులు చెల్లించాలని, పీఆర్సీ ప్రకటన, పాఠశాల విద్యా శాఖలోని ఎంఈఓ, డిప్యూటీ ఈవోలు ఖాళీలను భర్తీ చేయాలని, నూతనంగా ఏర్పడిన జిల్లాలకు జిల్లా విద్యాశాఖ అధికారి పోస్టులను మంజూరు చేయాలని, డైట్లలోని లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని, అన్ని జిల్లాలను ఇఎల్టిసి కేంద్రాలను ప్రారంభించి ఆంగ్లభాష నైపుణ్యాలను పెంపొందించాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.