Take a fresh look at your lifestyle.

కోడి పందేల స్థావరంపై దాడి

 

ముద్ర, గద్వాల:

గుట్టు చప్పుడు కాకుండా గట్టు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై గట్టు పోలీసులు దాడులు చేసి ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు‌ ఎస్ఐ శేఖర్ గౌడ్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన‌ వివరాలిలా ఉన్నాయి. తుమ్మలపల్లి గ్రామం శివారులో కొన్ని రోజులుగా ఓ ముఠా కోడి పందేలు నిర్వహిస్తుంది. మంగళవారం ఉదయం సైతం పందేలు నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో గట్టు ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడులో ముగ్గుర్ని అదుపులోకి తీసుకోగ, రూ.7,300 నగదు,‌ఒక పందెం కోడి, మూడు బైక్ లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.