సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :
జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ నెల 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా పాఠశాలలప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్, స్పెషల్ ఆఫీసర్స్ ప్రత్యేక చొరవ తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, సైన్స్ సెమినార్లు, సైన్స్ పుస్తక ప్రదర్శన, పరికరాల ప్రదర్శన, ప్రయోగాలు, ప్రాజెక్టుల ప్రదర్శనను నిర్వహించాలని పేర్కొన్నారు. అందుబాటులో ఉండే శాస్త్రవేత్తలతో ఉపన్యాసాలు, విజ్ఞానమేలాలను ఏర్పాటు చేయాలని కోరారు. పూర్తి వివరాల కోసం జిల్లా సైన్స్ అధికారి కల్లేపల్లి శ్రీనివాస్ 9849699382 నంబర్లో సంప్రదించాలని కోరారు. సైన్స్ కార్యక్రమాలకు సంబంధించిన రెండు లేదా మూడు ఫోటోలను cnukp2014@gmail.comకు పంపాలని తెలిపారు.