కళ్యాణానికి ఆనవాయితీగా రాoరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు అందజేత.
ముద్ర…. తుంగతుర్తి….
శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని తుంగతుర్తి మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగ రంగ వైభవంగా శుక్రవారం నిర్వహించారు .

మధ్యాహ్నం సీతా ,రామ లక్ష్మణ విగ్రహాలను ప్రత్యేకంగా పట్టు వస్త్రాలు, పూలతో అలంకరించి, వేద పండితులైన కాటూరి రామాచార్యులు శంకరమంచి శేషు శర్మ, కాటూరి లక్ష్మణచార్యులు ఆధ్వర్యంలో కళ్యాణ మండపం పైకి తీసుకువచ్చి వేదమంత్రాలు మధ్య కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు .సీతారాముల కల్యాణ మహోత్సవం తిలకించడానికి ప్రజలు తరలివచ్చారు .సీతారాముల కళ్యాణం మండపాన్ని రంగురంగుల పూలమాలతో కళ్యాణ మండపాన్ని అలంకరించారు

సీతారాముల కల్యాణానికి తలంబ్రాలు పట్టు వస్త్రాలను ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అందజేశారు .కళ్యాణ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు . కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి, ఆలయ చైర్మన్ ఎనగందుల సంజీవ, సర్పంచ్ మల్లెపాక సాయి బాబా, తల్లాడ కేదారి, ఉప సర్పంచ్ ఎనగందుల శ్రీనివాస్, సంకినేని గోవర్ధన్ రావు, మేనేని మాధవరావు, బండారు దయాకర్, కాసం మల్లయ్య, కోల వెంకటరామ నరసయ్య, ఉప్పుల రాంబాబు, ఎనగందుల గిరి, కటకం కిష్టయ్య, పెండెం రామ్మూర్తి, గుడుపూరు శ్రీనివాసరావు, కొండా రాజు, లతోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు