Take a fresh look at your lifestyle.

ఆదర్శం శ్రీరాముని జీవితం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

ముద్ర, ధర్మపురి:

శ్రీరాముని జీవితం ఆదర్శమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నియోజకవర్గంలోని గ్రామాల్లో నిర్వహించిన శ్రీసీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు.


ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహించిన కళ్యాణ వేడుకల్లో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

ధర్మపురి మండలం తీగల ధర్మారం శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణం వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ధర్మపురి పట్టణంలోని శ్రీలక్ష్మీ నరసింహా కాలనీ నిర్వహించిన సీతారామ కళ్యాణంలో మంత్రి అడ్లూరి పాల్గొన్నారు.

ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.

Leave A Reply

Your email address will not be published.