Take a fresh look at your lifestyle.

గ్రామ పాలన అధికారిపై దాడి హేయమైన చర్య : తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి గుర్రాల బాలకృష్ణ

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామ పాలన అధికారి భూపాల్ పై దాడి చేయడం హేయమైన చర్య అని తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి గుర్రాల బాలకృష్ణ ఖండించారు. క్షేత్ర స్థాయి విచారణ కొరకు విధి నిర్వహణలో భాగంగా భూమి మీదకు వెళ్లగానే కండ్లల్లో కారంపొడి చల్లి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.