Take a fresh look at your lifestyle.

జలీల్ పుర మస్జీద్ కమిటీ ఆధ్వర్యంలో భీమ్ యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

 
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

పట్టణంలోని జలీల్ పుర మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 14 జరిగే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల భీమ్ యాత్ర ర్యాలీ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మజీద్ కమిటీ అధ్యక్షుడు ఇగ్బాల్ చౌదరి, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, మజీద్ కమిటీ ప్రధాన కార్యదర్శి కాజమ్ అహ్మద్, స్థానిక వార్డ్ కౌన్సిలర్ బుర్హానుద్దీన్ పాల్గొని మాట్లాడుతూ ఏప్రిల్ నెలను మహనీయుల జయంతి ఉత్సవ మసంగా జరుపుకుంటున్నాం అని, ఉత్సవాలలో మహనీయుల యొక్క సేవలు వారి త్యాగాలను మరియు వారు చేసే పోరాటాలను వచ్చే తరాలకు తెలియజేయటానికి ఉత్సవాలు చాలా దోహదపడతాయన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి తన రాజ్యాంగం ద్వారా బడుగు బలహీనవర్గాల ప్రజల న్యాయమైన సమాన హక్కులను కల్పించారని అన్నారు. ఈ భీమ్ యాత్రలో ప్రజలు కులమతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలన్నారు. ఈ నెల 12 సాయంత్రం 6 గంటలకు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించే మైనారిటీల సమావేశానికి మైనార్టీ లందరూ పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ కార్యదర్శి అబ్దుల్ గఫ్ఫార్ చౌదరి, అమీర్ ఉద్దీన్, మైనార్టీ జర్నలిస్టు ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు ఎండి సుజావుద్దీన్, షేక్ హమీద్ పాషా, అమేర్, మహాతబ్,మాజీ కౌన్సిలర్ ఇరపాక నరసింహ,ఇటుకల దేవేందర్,కుతాడి సురేష్ పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.