Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ వైద్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం:జిల్లా కలెక్టర్ రాజర్షి షా

 

 
బోథ్, ముద్ర:

ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న మెరుగైన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని హమాలీవాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హోమియోపతి వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హనీమన్ 271వ జయంతిని పురస్కరించుకుని ‘ప్రపంచ హోమియోపతి దినోత్సవ’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుష్ వైద్య విధానాలైన హోమియోపతి, ఆయుర్వేదం, యునానీ, యోగా ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎలోపతి మందుల వల్ల దుష్ప్రభావాలు ఎదుర్కొనే వారికి హోమియోపతి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయమని అన్నారు. ఈ వైద్యంపై తనకున్న నమ్మకాన్ని పంచుకుంటూ, తన వ్యక్తిగత అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.
ప్రభుత్వ దవాఖానాలు, బస్తీ దవాఖానాల ద్వారా అందుతున్న ఉచిత సేవలను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బండారి అనూష, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. నరేందర్ రాథోడ్, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.