- జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్.
- నవాబ్ పెట్ మండలం చించల్ పెట్ ఉన్నత ఆవరణలో మొక్కలు నాటిన కలెక్టర్ ప్రతీక్ జైన్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య.
వికారాబాద్, ముద్ర ప్రతినిధి: వనమహోత్సవం కార్యక్రమం లో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.బుధ వారం వికారాబాద్ జిల్లా నవాబ్ పెట్ మండలం చించల్ పెట్ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత ఆవరణలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, చేవెళ్ళ శాసన సభ్యులు కాలె యాదయ్య తో కలిసి మొక్కలు నాటారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని అమలు సంరక్షించే విధంగా పకడ్బందీ చర్యలు చేపట్టడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. నాటిన మొక్కల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, బోర్డులు ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు, అధికారులకు సూచించారు. ఎక్కడైనా మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్తగా మొక్కలు నాటాలని అన్నారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. . నాటిన ప్రతి మొక్క బతికేలా పక్కాగా సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులను, అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వన మహోత్సవాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని, పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో లక్ష్యాల సాధన కోసం నిరంతర పర్యవేక్షణఉంటుందని అన్నారు.సమాజం లో ఉండే నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ కమిటి ల ద్వార ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడము జరిగిందన్నారు.ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాల ప్రగతిపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఈ సందర్బంగా పరిశీలించారు. పేదలకు సొంత ఇంటిని సమకూర్చాలని ప్రభుత్వం ఆశయంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో అలసత్వానికి తావులేకుండా లక్ష్య సాధన కోసం కృషి చేయాలని అన్నారు. ఇల్లు మంజూరైన లబ్దిదారులు అందరూ తప్పనిసరిగా ఇళ్ళను నిర్మించుకునేలా చూడాలన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8, 9, 10 తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారము భోజనం పెడుతున్నారా, బుక్స్ అందరికి చేరాయా ,స్కూల్ డ్రెస్ లు చేరాయా వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేవెళ్ళ శాసన సబ్యులు కాలే యాదయ్య మాట్లాడుతూ వర్షా కాలం మొదలైనందున వన మహోత్సవం కార్యక్రమమ లో బాగంగా ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరు రెండు మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించాలని , తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పచ్చదనం కోసం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన “వనమహోత్సవం” కార్యక్రమంను విజయవంతం చేయాలన్నారు. సి యం రిలీఫ్ ఫండ్ చెక్కులను జిల్లా కలెక్టర్ తో కలిసి పంపిణి చేశారు .అనంతరము అక్నా పూర్, అత్తా పూర్ గ్రామాలలో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను పూర్తి చేసుకోవాలని లబ్దిదారులకు తెలిపారు.ఈ కార్యక్రమం లో తహసీల్దారు బుచ్చయ్య, ఎం పి డి ఓ అనురాధ, ఎ ఏం సి చైర్మెన్ రాం రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు ,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
