కుషాయిగూడ, ముద్ర విలేఖరి: క్రీడా అకాడమీలతో క్రీడాకారుల నైపుణ్యత మరింత పెంపొందుతుందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ మహేష్ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు విక్టరీ బ్యాట్మెంటన్ అకాడమీ ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువతకు క్రీడల్లో మంచి భవిష్యత్తు ఉందని, అందుకు అకాడమీల్లో నిత్య సాధన ఎంతో అవసరమని పేర్కొన్నారు. అలాగే క్రీడలు శారీరక దేహదారుడ్యాన్ని, మానసికల్లాసాన్ని పెంపొందిస్తాయన్నారు. ప్రస్తుత పోటీ తరుణంలో శిక్షణలో మెలుకువలను నేర్చుకునేందుకు అధునాతక సాంకేతిక పరిజ్ఞానంతో బ్యాట్మెంటన్ కోర్టులను నిర్మించిన విక్టరీ అకాడమీ నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ ఏసీపి యాస వెంకట్ రెడ్డి, ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, కార్పొరేటర్లు శిరీష సోమశేఖర్ రెడ్డి, స్వర్ణరాజ్ శివమణి, బాల్కా సుమన్, గెల్లు శ్రీనివాస్, అకాడమీ నిర్వాహకులు వెంకట రమణారెడ్డి, చెక్క ప్రసాద్, కోనేరు భాస్కర్, స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.