Take a fresh look at your lifestyle.

రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గడువు పొడగింపు

  •  కలెక్టర్ కోయ శ్రీ హర్ష.

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 14 వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సంబంధిత మండల పరిషత్ కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని, ఈ కార్యాలయాల్లో ప్రజాపాలన కౌంటర్ నందు దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.నిరుద్యోగ యువతపై పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తూ రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశ పెట్టిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ యువకులకు సంబంధిత కార్పొరేషన్ల ద్వారా 100 శాతం సబ్సిడీ పై 50 వేల యూనిట్, 90 శాతం సబ్సిడీ పై లక్ష రూపాయల యూనిట్, 80 శాతం సబ్సిడీతో 2 లక్షల రూపాయల యూనిట్, 70 శాతం సబ్సిడీతో 4 లక్షల వరకు యూనిట్ యువకులు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వ సహకారం అందిస్తుందని అన్నారు. చిన్న నీటిపారుదల రంగంలో యూనిట్ ఏర్పాటు చేసుకునే వారికి 100% సబ్సిడీ, దుర్బల సమూహాలకు లక్ష రూపాయల వరకు 90 చదువు సబ్సిడీ ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం పొందేందుకు గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయ పరిమితి 1,50,000 రూపాయల లోపు, పట్టణ ప్రాంతాలలో రెండు లక్షల రూపాయల లోపు ఉండాలని, తెల్ల రేషన్ కార్డులో దరఖాస్తుదారుని పేరు లేని పక్షంలో మాత్రమే ఆదాయం సర్టిఫికెట్ సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. రాజీవ్ యువ వికాస పథకానికి అభ్యర్థుల వయసు 21 నుంచి 55 మధ్యలో ఉండాలని, వ్యవసాయ అనుబంధ రంగాల యూనిట్ల ఏర్పాటు దారులకు 60 సంవత్సరాల వరకు సడలింపు ఇవ్వడం జరిగిందని తెలిపారు. 5 సంవత్సరాలకు కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే ఉపాధి పథకం మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు లెదా ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, రవాణా రంగ పథకాలకు శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, వ్యవసాయ పథకాలకు పట్టాదారు పాస్ పుస్తకం, దివ్యాంగులు సైతం సర్టిఫికెట్లు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఆన్ లైన్ పోర్టల్ లో లేదా ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేయాలని అన్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత వారికి మంజూరు పత్రాలు దారి చేయడంతో పాటు యూనిట్ గ్రౌండింగ్, వ్యాపార నిర్వహణలో పాటించాల్సిన సూత్రాలపై శిక్షణ కూడా అందిస్తామని, ఆసక్తిగల యువకులు నిర్ణిత గడువు లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.