ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సిలను గెలిపించే దిశగా నాయకులు, కార్యకర్తలు ముందుకు వెళ్లాలని కేంద్ర హోం సహాయక మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ అన్నారు.పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవ రెడ్డి అధ్యక్షతన పెద్దపల్లి నందన గార్డెన్స్ లో శుక్రవారం పెద్దపల్లి జిల్లా పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే దిశగా కిందిస్థాయి కార్యకర్త నుంచి నాయకుల వరకు ప్రచారంలో పాల్గొని బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు.జిల్లాలోని నియోజకవర్గాల ప్రభారీలు,మండల ప్రభారీలు,మండల అధ్యక్షులు,బూత్ కమిటీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ అంజి రెడ్డి,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య,కామారెడ్డి శాసనసభ్యులు కాటేపల్లి వెంకటరమణ రెడ్డి, ఎంపీ కాంటెస్ట్ అభ్యర్థి శ్రీ గోమాసే శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యేలు శ్రీ గుజ్జుల రామకృష్ణరెడ్డి, శ్రీ కాసిపేట లింగయ్య,జిల్లా మాజీ అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, చల్లా నారాయణ రెడ్డి, కందుల సంధ్యారాణి,జిల్లా ఇన్చార్జిలు మరియు ప్రభారీలు,మండల అధ్యక్షులు,నియోజకవర్గాల కన్వీనర్లు, బూత్ కమిటీ అధ్యక్షులు,బీజేపీ సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు.