ఆత్మకూర్ ఎం, ముద్ర:- రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా ప్రతి నిరుపేద కుటుంబాలకు అందిస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హామీ ఇచ్చారు. శుక్రవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన (గ్రామ సభ)కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ పేద ప్రజలకు సమగ్రంగా సంక్షేమ పథకాలు అందించేందుకు ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రభుత్వం అందించేందుకు ఎలాంటి అవకాశం లేకుండా నిష్పక్షపాతంగా ప్రజలకు అందించేందుకు ప్రజా పాలన ఏర్పాటు చేసి, ప్రజల మధ్యలోనే లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సభ్యునియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీవో నాగిరెడ్డి, తహసిల్దార్, ఎంపీడీవో, ఎండిఓ, మండల ప్రత్యేక అధికారి తో పాటు తాజా మాజీ ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష కమిటీ నాయకులు, గ్రామ ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.