- ఎంక్వైరీ లేకుండా ఇస్టానుసారంగా జాబితాలో పేర్లు
- బిజెపి నియోజక వర్గ నాయకులు అన్వేష్,రమేష్
ముద్ర,పానుగల్ :- తప్పుల తడక గా అంత అవినీతి డొల్లగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారని బిజెపి కొల్లాపూర్ నియోజకవర్గ కో కన్వీనర్ సంగనమోని అన్వేష్, BJYM జిల్లా ప్రధాన కార్యదర్శి బూతగాళ్ళ రమేష్ లు అన్నారు.శుక్రవారం కేతేపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో అధికారులను నిలదీశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతా రాబోయే స్థానిక ఎన్నికల ఓట్ల స్టంట్ అని,ప్రజలను మభ్య పెట్టి ఆశ చూపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నారు.6 గ్యారెంటీ ల పేరుతో మోసపూరిత హామీలతో గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి స్థానిక ఎన్నికల దృష్టి పెట్టుకొని ప్రజలను మరోసారి మోసగించడానికి వస్తున్నరని అన్నారు.
రైతు ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేనటువంటి నిరుపేద కుటుంబాలకు ప్రతి సంవత్సరం 12 వేల రూపాయలు ఇస్తున్నామని ఈ స్కీం కింద అర్హులకు 2022 నుంచి 2024 వరకు జాబ్ కార్డులో కనీసం 20 రోజులు పని చేసిన వాళ్ల కుటుంబాలను గుర్తించి వాళ్లకి రైతు ఆత్మీయ భరోసా ఇస్తున్నామని చెప్తున్నారన్నారు,కానీ ఇప్పటికి జాబ్ కార్డు రాకుండా పని చేసిన డబ్బులు రాకుండా ఇక్కడ బతకలేక హైదరాబాద్ పోయి కూలి పని చేసుకున్నటువంటి నిరుపేద రైతులకు దక్కని ఆత్మీయ భరోసా అన్నారు. కేతేపల్లి గ్రామానికి సంబంధించి 42 మందిని రైతు ఆత్మీయ భరోసా కింద సెలక్షన్ చేస్తే దాంట్లో 30 మంది భూములు ఉన్నవాళ్లే ఉన్నారు 12 మంది మాత్రమే భూములు లేనివాళ్లు అని,రేషన్ కార్డ్స్ 500 మంది దాకా అప్లై చేసుకుంటే ఇప్పుడు వచ్చినవి 30 మాత్రమే అవి ఏ విధంగా సెలక్షన్ చేసిందంటే సంబంధిత అధికారులు పొంతన లేని సమాధానం చెబుతున్నారన్నారు.
250 దాకా కొత్త రేషన్ కార్డులకు యాడ్ చేసినం అని చెబుతండ్రు ఇవి వస్తాయి అంటే ఆఫీసర్లు కూడా సరైనటువంటి అవగాహన లేదు ఉన్న కూడా సమాధానం దాటు వేసే ప్రయత్నం చేస్తున్నారని వారు అన్నారు.పెద్ద గ్రామపంచాయతీలో 30 మందికి మాత్రమే రేషన్ కార్డులు జాబితాలో పేర్లు నమోదు కావడం దారుణమన్నారు.ఇందిరమ్మ ఇల్లు 450 దాక సెలక్షన్ చేసినమని చెబుతున్నారని అందులో 260 పేర్ల గోడకు లిస్ట్ అవుట్ చేసి అతికించారని అధికారులు మాత్రం ఇవి ఫైనల్ కావు అని చెప్తున్నారన్నారు.ఎవరికి వచ్చినవి అని పక్కా క్లారిటీ లేకుండా ఉన్నాయన్నారు. రైతు ఆత్మీయ భరోసా గాని కొత్త రేషన్ కార్డులు గాని,ఇందిరమ్మ ఇల్లు గాని,పెన్షన్లు గాని,ఇప్పుడు అర్హత లేకున్నా వచ్చినటువంటి లిస్ట్ లో ఎవరికీ ఇచ్చుకుంటున్నది మాకు సంబంధం లేదు కానీ పక్కా ఎవరైతే అర్హత గల వారు ఉన్నారో వాళ్లకు మాత్రం ముందు ఇవి అందాలి, లేకుంటే కేతేపల్లి భారతీయ జనతా పార్టీగా మేము బాధితుల పక్కల నిలబడి అవి సాధించేవరకు పోరాడుతామని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు సత్యనారాయణ,రామకృష్ణ,శేఖర్,చంద్ర శేఖర్ గౌడ్,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.