ప్రాధమిక సహకార సంఘాల చైర్మన్ ల ఫోరం నాయకులు డిమాండ్…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
సహకార వ్యవస్థలో నామినేటెడ్ విధానంపై నిర్ణయంను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ప్రాధమిక సహకార సంఘాల చైర్మన్ల ఫోరం నాయకులు డిమాండ్ చేశారు.

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జగిత్యాల జిల్లా పీఏసీఎస్ చైర్మన్స్ ఫోరం నాయకులు మాట్లాడుతూ సహకార వ్యవస్థకు రైతులే వెన్నుముక అని, ఎన్నికలకు పొయే దమ్ములేక నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాలను ఎన్నుకునే విధంగా గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీర్మానించడం చూస్తే అడ్డదారిలో ఎన్నుకునే ధైర్యం లేక ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేసిందని మండిపడ్డారు. సహకార సంఘాలపై ప్రభుత్వం కక్ష్య సాధింపు తగదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం లో సహకార వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఆరోపించారు. అలాగే ప్రజాక్షేత్రంలోనూ ప్రజలు, రైతులను సమీకరించి పోరాటం చేస్తామని హెచ్చరించారు. అయిన విరమించుకోకపోతే న్యాయ పోరాటం కూడా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ ల ఫోరం నాయకులు సాగర్ రావు, మహిపాల్ రెడ్డి, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.