Take a fresh look at your lifestyle.

ప్రజావాణి పిర్యాదులపై అధికారులు సత్వరమే పరిష్కారం చూపాలి – కలక్టర్

 

ముద్ర ప్రతినిధి, కోదాడ ….. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని, నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర స్థాయి గ్రీవెన్స్ లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు దరఖాస్తు లను పరిష్కరించాలని తెలిపారు.

కలక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబందించి 33 దరఖాస్తులు, డి ఆర్ డి ఏ 6, డి పి ఓ 5, డి డబ్ల్యూ ఓ 5, మిగిలిన 29 దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని, మొత్తం 78 దరఖాస్తులు వచ్చాయాని వాటిని పరిష్కరించేందుకు శాఖల వారీగా పంపించటం జరిగిందని కలెక్టర్ ఈ సందర్బంగా అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కే సీతారామా రావు, సీఈఓ జిల్లా పరిషత్ శిరీష, రెవెన్యూ డివిజన్ అధికారి వేణు మాధవరావు, ఇతర జిల్లా అధికారులు, తదితరులు హాజరైనారు.

Leave A Reply

Your email address will not be published.