ముద్ర, తెలంగాణ బ్యూరో : పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్న నీటి వనరులు, భూ సమస్యలపై దృష్టి పెట్టాలని సామాజిక కార్యకర్త డా. లుబ్నా సర్వత్విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తో గురువారం లుబ్నా సర్వత్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పట్టణ ప్రాంతాల్లో నీటి వనరులు చాలా అధ్వాన్నంగా మారాయని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తంచేశారు.