Take a fresh look at your lifestyle.

నగర శివారు మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్

  • సీఎం ఆదేశాలతో శివారు మున్సిపాలిటీల ప్రగతి తీరు పరిశీలన.
  • శంషాబాద్ మున్సిపాలిటీ లో అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు.

ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి: హైదరాబాద్ చుట్టుపక్కల వేగంగా అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీల  అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రా5ధాన్యత ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు తెలిపారు. ఇందులోభాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గాను తన ఈ పర్యటన ఉద్దేశమని ఆయన చెప్పారు.శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శంషాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, సంబంధిత శాఖల సెక్రటరీలతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఇటీవల కొన్ని గ్రామాలు ఓఆర్ఆర్  అవతలి వైపు, ఓఆర్ఆర్ పక్కన గల గ్రామాలు, జిహెచ్ఎంసిలో  విలీనమైనందున ఆయా గ్రామాల మౌలిక సదుపాయాలు ఏమేరకు అభివృద్ధి చెందుతున్నాయో తెలుసుకోవటానికి ముందుగా శంషాబాద్ మున్సిపాలిటీని సందర్శిస్తున్నానని చెప్పారు.ఈ సందర్భంగా సీఎస్ మున్సిపాలిటీలో త్రాగునీటి సౌకర్యం సమీక్షించగా దానిపై జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన కాలనీలలో పైప్ లైన్లను వేయాలని, అందుకు సంబంధించిన ఎస్టిమేట్లను వెంటనే సమర్పించాలని సంబంధిత అధికారులు ఆదేశించడం జరిగిందని తెలిపారు.జిల్లాలో ఎక్కడ తాగునీటి కొరత లేకుండా కావలసిన నిధులను గ్రామపంచాయతీలకు, మునిసిపాలిటీలకు విడుదల చేస్తున్నట్లు వివరించారు.తదుపరి ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు మాట్లాడుతూ..పన్ను వసూళ్లలో ఈ సంవత్సరము 23 శాతం అతి తక్కువగా చేయడంపై నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలని సూచించారు.కొత్త ఇండ్ల అసెస్మెంట్ లను చేయించి మున్సిపాలిటీల ఆదాయం పెంచాలని అధికారులకు ఆదేశించారు పారిశుద్ధం నిర్వహణ ఏ విధంగా ఉందని, ప్రజల నుండి  సమస్యలు రాకుండా చూడాలని సూచించారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, వాటి పురోగతిపై సంబంధిత అధికారులను చీఫ్ సెక్రటరీ అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ పరిధిలో విద్యుత్ దీపాలు వార్డుల్లో నాలాల శుభ్రత తదితర అంశాల్లో తగిన ప్రాధాన్యత ఇచ్చి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పని చేయాలని అధికారులకు ఆయన సూచించారు. అనంతరం కోత్వాల్ గూడాలో నిర్మాణంలో ఉన్న హెచ్ఎండిఏ ఎకో పార్కును సందర్శించి అక్కడి పక్షుల పార్కులోని వివిధ దేశాల పక్షులు, గార్డెనింగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయని నిర్వాహకులకు తెలియజేశారు.

  • బద్వేలు ప్రభుత్వ భూముల పరిశీలన.

తదుపరి రాజేంద్రనగర్ బుద్వేల్ లోని ప్రభుత్వ భూములను సీఎస్ రామకృష్ణ రావు పరిశీలించారు. ఈ పర్యటనలో రాష్ట్ర మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇలంబర్తి, హెచ్ఎండిఎ సెక్రటరీ సర్ఫరాజ్ అహ్మద్, జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, ఆర్డిఓ వెంకట్ రెడ్డి, హౌసింగ్ పీడీ నాయక్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.