Take a fresh look at your lifestyle.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా సమస్యలు పరిష్కరిస్తా… -మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య.

మోత్కూర్ ముద్ర న్యూస్:

మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని ఆరవ వార్డు ఆరేగూడెం లో మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నరసయ్య శనివారం పర్యటించి వార్డులోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆరో వార్డు ప్రజలు ఇక్కడ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించగా మున్సిపల్ సిబ్బందితో వెంటనే దోమల నివారణకు శానిటేషన్ పిచికారి చేయించారు. విద్యుత్ స్తంభాలు శిధిలా వ్యవస్థకు చేరుకున్నాయని మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే పాత విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని విద్యుత్ ఎఈ ప్రభాకర్ రెడ్డిని ఆదేశించారు. అలాగే ఆరో వార్డులో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కే సతీష్ కుమార్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బద్దం నాగార్జున రెడ్డి, అర్థ ప్రతాపరెడ్డి, కృష్ణ యాదవ్, సిబ్బంది నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.