ముద్ర, బండ్లగూడ: నార్సింగి మున్సిపల్ పరిధిలో కబ్జాకు గురవుతున్న 25 కోట్ల విలువచేసే పార్కు స్థలాన్ని హైడ్రా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్సింగి టౌన్ లోని అరుణోదయ కాలనీలో హౌసింగ్ సొసైటీ కి సంబంధించిన సుమారు 1600 గజాలు స్థలం ఉన్నది. ఇటీవల ఓ నాయకుడు ఈ స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ చుట్టూ ప్రహరీ నిర్మాణాలు కూడా ప్రారంభించాడు. ఈ విషయమై స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా అధికారులు పార్కు స్థలంలో అక్రమాలను సోమవారం కూల్చివేశారు. 25 కోట్ల రూపాయల విలువ చేసే ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.