Take a fresh look at your lifestyle.

శివాలయ నూతన నిర్మాణ పనులు ప్రారంభం

 

ముద్ర, కోరుట్ల;
స్థానిక అయ్యప్పగుట్టపై గల అయ్యప్ప స్వామి దేవాలయ ఆవరణలో త్వరలో నిర్మించబోయే ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శివాలయం నూతన నిర్మాణ పనులు ప్రారంభోత్సవం సోమవారం రోజు ఘనంగా జరిగింది కార్యక్రమానికి హంపి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామి చేతుల మీదుగా నిర్మాణ పనులకు శంకురార్పణ చేశారు ఇందులో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు పాలెపు రామశర్మ వైదిక నిర్వహణలో ప్రధాన కలశ స్థాపన, సర్వతోభద్రమండల రచన, వాస్తు యోగిని, క్షేత్ర మండప రచన, శత రుద్రీయం, రుద్ర హోమం, చండీ హోమం, మహా లింగార్చన, వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ గురు స్వామి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు ప్రధాన శివాలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి తోటరాజు, కోశాధికారి జుంబర్తి రమేష్, ఉపాధ్యక్షులు గట్ల ఆనంద్, నిముషకవి నాగరాజు, సహాయ కార్యదర్శి శ్రీరాముల శ్రీనివాస్, గౌరవ సలహాదారులు గడ్డం మధు, గాజెంగి లక్ష్మీపతి, మంచాల రాజలింగం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్, శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ యతి రాజం నరసయ్య, గురుస్వాములు కొత్త సురేష్, గిల్లి గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.