ముద్ర గండిపేట్ : బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడే వారి కోసం పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మణికొండకు విచ్చేసే సందర్భంగా భారత రాష్ట్ర సమితి మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ ఆద్వర్యంలో నాయకులందరూ ఏకీకృత్తమై ల్యాంకో హిల్స్ విద్యుత్ శక్తి ఆఫీసు వద్ద ఆమెను సాధరంగా, సగౌరవంగా స్వాగతం పలుకుతూ గజమాలతో సత్కరించారు.అనంతరం స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి అల్కాపూర్ టౌన్షిప్ రోడ్ నెంబర్ 13 కు వెళ్ళి శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు గట్టు రామచందర్ రావును వారి నివాసంలో కలిసి పరామర్శించారు.ఈ సందర్భంలో ఆమె మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ పార్టీ ప్రతి నాయకుడు ప్రజా సంక్షేమం గురించి ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని వివరించారు.మణికొండలో మరి ప్రత్యేకించి గుడ్ మార్నింగ్ నినాదంతో ప్రతి రోజూ ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజల భాగోగులను తెలుసుకుంటూ ప్రాజభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఇదే విధంగా ప్రజలతో మమేకమై ఏ ఎన్నికలు జరిగినా గులాబీ జెండా రెపరెపలాడిస్తారని ఆశీస్తూ తన మనోభావాన్ని వివరించారు.ఈ కార్యక్రమంలో మణికొండ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, కుంభగల్ల ధనరాజ్, గుట్టమీది నరేందర్, రూపా రెడ్డి, ఉపేందర్నాథ్ రెడ్డి, ముత్తంగి లక్ష్మయ్య, ఏర్పుల శ్రీకాంత్, సంఘం శ్రీకాంత్, కీర్తిలత గౌడ్, విజయ లక్ష్మి, రాజేంద్రప్రసాద్, యాలాల కిరణ్, షేక్ ఆరిఫ్, కృష్ణ రాజీ, సుమనళిని, బుద్దోల్ బాబు, బొడ్డు శ్రీధర్, రామకృష్ణారెడ్డి, మధు చందన, బిందు, అనూష, అన్షు, ప్రియా, జ్యోతిలు పాల్గొన్నారు.
