Take a fresh look at your lifestyle.

అధ్వానంగా ప్రభుత్వ పాఠశాలలు

  • బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్.
  • ఎన్ని సార్లు సందర్శించిన పరిష్కారం నోచుకోలేని ప్రభుత్వ పాఠశాలలు
    దుస్థితి.

ముద్ర, శేరిలింగంపల్లి విలేఖరి: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మదినగూడ ప్రభుత్వ పాఠశాలలో వరద నీరు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారాని తెలుసుకుని బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్ స్థానిక నాయకులతో కలసి సందర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు ఎన్ని సార్లు పాఠశాలను సందర్శించిన పరిష్కరం కాకపోడం సిగ్గు చేటు అన్ని అన్నారు.వరద ప్రభావితం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్ని, ప్రభుత్వ పాఠశాలలనుపట్టిచ్చుకోకపోవడం వలనే ఈ దుస్థితి నెలకొందని రాష్ట్రంలో గురువారం నాడు మొదలైన స్కూళ్లకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతామన్న రాష్ట్ర ప్రభుత్వం మాటలతో చెప్తుంటే దానికి భిన్నంగా మదినగూడ లో డ్రైనేజీ నీళ్ల మధ్యల విద్యార్థులు గడపాల్సిన దుస్థితి వచ్చింది, ఈ సమస్య కాదు బస్తీల్లో కూడా చిన్న వర్షాలు కురిస్తే మొత్తం నీటిమయం అయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్ని ఇప్పటికైనా నాయకులు, అధికారులు మేలుకొని ఇలాంటి సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని అన్నారు. లేని పక్షంలో ప్రజలే మీకు బుద్ది చెపుతారు అన్ని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, బిజెపి నాయకులు సురేష్ కురుమ , కేవీ, కుమార్, శివ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.