మాదాపూర్, ముద్ర : మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రైవేట్ హాస్పిటల్ సమీపంలోని గుడిసెలలో నివసించే 10 సంవత్సరాల వయస్సు గల బాలిక అదృశ్యం ఐనట్టు ఎస్ ఐ వెంకట రమణ తెలిపారు. ఘటనకు సంబందించి,మంజుదేవి అమిత్ పర్వాని దంపతుల కు నలుగురు సంతానం.ముగ్గురు కొడుకులు ఒక కూతురు అయితే కూతురు జుగుని కి మతిస్థిమితం సరిగ్గా లేనందున.ఈ నెల 16వ తేదీన తన తల్లి లేని సమయంలో పది సంవత్సరాల జుగుని ఇంటి నుండి వెళ్ళిపోయిందని, ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత 18వ తేదీన జుగుని గుడిసె దగ్గర కనిపించక పోవడం తో చుట్టుపక్కల వారిని విచారించగా జుగుని ఆచూకీ లభించలేధని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్టు ఎస్ ఐ వెంకట రమణ తెలిపారు.