Take a fresh look at your lifestyle.

కేసీర్ క్యాంపు కార్యాలయంపైన కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: *మెతుకు ఆనంద్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
బి ఆర్ ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు గుండాల్ల వ్యవహరిస్తున్నారని,క్యాంప్ కార్యాలయంపైన దాడి చేసి, ఫర్నిచర్ ధ్వంసం చేయాల్సినంత అవసరం ఏముంది?గతంలో కూడా బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ క్యాంప్‌ కార్యాలయం మాజీ మంత్రివర్యులు హరీశ్‌ రావు క్యాంప్‌ కార్యాలయంపైన కూడా ఇదే విధంగా దాడిచేశారు. ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మార్చడానికి ఇలాంటి కుట్రలు పన్ని ఉద్దేశపూర్వకంగా దాడులకు ప్రేరేపిస్తున్నారని అన్నారు. ఎప్పటికప్పుడు ఎదో ఒక అంశం తెర మీదకు తెచ్చి ప్రజలను పక్కదారి పట్టించేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సమస్యను పక్కదారి పట్టించడం రేవంత్ రెడ్డి నైజం, రాష్ట్రంలో హింసను ప్రేరేపించాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడన్నారు. ఇటువంటి చిల్లర వేషాలకు బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలు భయపడరన్నారు.
బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల క్యాప్ కార్యాలయాలపై దాడులు జరగలేదన్నారు. అధికారాన్ని అడ్డగోలుగా వినియోగిస్తూ, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ రేవంత్ రెడ్డి ఆనందం పొందుతున్నారని పేర్కొన్నారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకొని మీరు చేస్తున్న ప్రతి తప్పును రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, సరైన సమయంలో వడ్డీతో సహా చెల్లిస్తారని తెలిపారు. ఇప్పటికే మీ పాలన వల్ల ప్రజలు నష్టపోయారు, మీకు ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇప్పటికైనా మీ వక్రబుద్ధి మానుకొని ప్రజలకు సేవ చేయడంపైన దృష్టి పెడితే బాగుంటుందని ప్రధాన ప్రతిపక్షంగా వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులుగా తెలియజేస్తున్నమ్మన్నారు.

Leave A Reply

Your email address will not be published.