Take a fresh look at your lifestyle.

జనగణన కార్యకలాపాలపై సమీక్షించిన శేరిలింగంపల్లి జోనల్ కార్యదర్శి

 

ముద్ర, శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయన్ అమిత్ ఐఏఎస్ ఈరోజు జోనల్ కాన్ఫరెన్స్ హాల్‌లో జనగణన కార్యకలాపాలపై వార్డుల నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో వార్డుల వారీగా జనగణన ఎన్యుమరేషన్ పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు. జనగణనలో ఖచ్చితమైన సమాచార సేకరణ, ప్రజల్లో సమర్థవంతమైన అవగాహన మరియు జోన్ వ్యాప్తంగా నిర్ణీత గడువులోగా జనగణన కార్యకలాపాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి ఇంటి వివరాలను పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని, ప్రజలకు జనగణన ఆవశ్యకతపై విస్తృత ప్రచారం చేయాలని జోనల్ కమిషనర్ సూచించారు. వార్డు నోడల్ అధికారులు క్షేత్రస్థాయిలో ఎదురౌవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, జనగణన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.

జనగణన అనేది దేశాభివృద్ధికి, పథకాల రూపకల్పనకు కీలకమని, ప్రజలందరూ అధికారులకు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.